అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పూలకుంటపల్లి పెద్దతండా, వెంకట్రాంపల్లి తండా, గుండాల తండా తదితర గ్రామాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించి బెల్లం ఊటతో పాటు, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
గుంతకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - గుంతకల్లు నేర వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం ఊటను ధ్వంసం చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
గుంతకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఈ దాడులు నిర్వహించామని స్థానిక సీఐ రాము అన్నారు. అందులో భాగంగా 2400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని పేర్కొన్నారు, ఎనిమిది మంది నాటుసారా తయారీ దారులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి.