అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లి సుగాలి తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 40 బెల్లం బస్తాలు, 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో మడకశిర సిఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ మస్తాన్, నాగమణి, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం - latest ananthapuram district news
ప్రభుత్వ మద్యం ధరలు అధికంగా పెంచడంతో నాటు సారా తయారీదారులకు ఇది వరంగా మారింది. మందు బాబులు ప్రభుత్వ మద్యం కొనలేక నాటుసారాకు ఎగబడుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తయారీదారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు.
నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు