అనంతపురం జిల్లాలో...
శెట్టూరు మండలం బసంపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 1,060 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా నుంచి అడ్డదారుల్లో తీసుకొస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. మద్యంతో పాటు ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
గుత్తి మండలం గొందిపల్లిలోని కొండగుట్టలో స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో సారా తయారీ దారులు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.