ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ మద్యం తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడులు - karntaka wine seized in ananthapur

అనంతపురం జిల్లాలో నాటు సారా తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం తయారీ సామగ్రి, సారాను ధ్వంసం చేశారు.

anantapur police ride on liquor illegal selling centre
అక్రమం మద్యం తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడులు

By

Published : Nov 8, 2020, 3:34 PM IST

అనంతపురం జిల్లాలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్​సెర్చ్ చేపట్టారు. ఇందులో భాగంగా కర్ణాటక మద్యం, నాటు సారా తయారీ, విక్రయాలపై దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు తండాలు, అటవీ ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని రహదారులు, గ్రామాలు, తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో సారా తయారీ సామగ్రిని ధ్వంసం చేయగా.. కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details