ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తిపై దాడి చేస్తున్నారని సీఐకి ఫోన్​.. తీరా చూస్తే! - ఫోన్​కాల్​తో పరుగులు పెట్టిన అనంతపురం పోలీసులు

అనంతపురం రెండో పట్టణ స్టేషన్ పరిధిలోని నాయక్​ నగర్​లో.. ఓ వ్యక్తిపై దాడి చేస్తున్నారని సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. తీరా అతడిని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని తెలిపాడు. ఫోన్​ చేసిన వ్యక్తిని పట్టుకుని నిలదీస్తే.. దాడి చేస్తారేమోననే భయంతో ఫోన్ చేసినట్లు పేర్కొన్నాడు.

police ran in streets with fake call to anantapuram ci
అనంతపురం సీఐకి బూటకపు ఫోన్​ కాల్

By

Published : Mar 5, 2021, 3:26 AM IST

అనంతపురం సీఐకి బూటకపు ఫోన్​ కాల్

ఓ వ్యక్తి ఫోన్ కాల్.. అనంతపురం పోలీసులను పరుగులు పెట్టించింది. నాగభూషణం అనే వ్యక్తిపై నాయక్ నగర్​లో కొంతమంది దాడి చేస్తున్నారని సీఐ జాకీర్ హుస్సేన్​కు ఫోన్ వచ్చింది. అతడి కోసం పోలీసులు వీధులన్నీ గాలించారు. చివరికి ఆ వ్యక్తిని పట్టుకుని విచారణ జరపగా.. తనపై దాడి జరగలేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నించగా.. దాడి చేయలేదని, కేవలం తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నలుగురు వ్యక్తులు కలిసి మాట్లాడారని తెలిపాడు. భయంతో ఫోన్ చేసినట్లు వెల్లడించాడు. తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. స్థానిక నాయకులను పిలిపించి సీఐ హెచ్చరించారు. తమ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details