ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - ananthapuram district crime news

అనంతపురం జిల్లా కొండగుట్టలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

Police raids on wine manufacturing sites in kothagutta ananthapuram district
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

By

Published : Aug 12, 2020, 9:10 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొండగుట్టలో నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్​రెడ్డి అన్నారు.

7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సారా తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు. నిబంధనలను అతిక్రమించి నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details