అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాల తండా గ్రామ సమీపంలోని కొండగుట్టల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఖాసీం సాహెబ్ అధ్వర్యంలో సారా స్థావరాలపై గస్తీ నిర్వహించామని గుంతకల్లు రూరల్ సీఐ రాము చెప్పారు. సుమారు 2 వేల లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. 25లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - natusara seized in anantapur district
అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు మండలం గుండాల తండా గ్రామంలో నాటుస్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. 25లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు