అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. మండలంలోని పలు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్‌లో భాగంగా రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం నుంచే నాటుసారా స్థావరాలపై సోదాలు నిర్వహించారు.
నాటు సారా తయారు చేస్తున్నారని తమకు అందిన పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని స్థానిక రూరల్ సీఐ ఎండీ రియాజ్ అహ్మద్ తెలిపారు. నాటుసారా తయారీ చేసే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి బిందెలలో నిల్వ ఉంచిన రెండు వేల లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులను పోలీసులు హెచ్చరించారు.
కదిరి, నల్లచెరువు మండలాల్లో దాడులు..