లాక్డౌన్ నిబంధనతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు నాటుసారా తయారు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో ఎక్సైజ్ అధికారులు అక్రమ నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
అక్రమ నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - wine manufacturing centers in uravakonda
అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూర్ మండలాలలోని పలు గ్రామాల్లోని నాటుసారా తయారీ స్థావరాలపై ఉరవకొండ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 లీటర్ల సారాను, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
![అక్రమ నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు Police raids on illegal Wine manufacturing plants In uravakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6918288-399-6918288-1587704102929.jpg)
అక్రమ నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసు దాడులు