ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బసినేపల్లి సమీపంలో 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - gutti mandal latest news

బసినేపల్లి గ్రామ సమీపంలోని నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు దాడులు చేశారు. 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు గుత్తి సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలియజేశారు.

police raids on basinepalli village and caught 2500 litres of cheap liquor
నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు దాడులు

By

Published : Jul 11, 2020, 3:08 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details