అనంతపురం జిల్లా పరిగి మండలంలో పేకాటస్థావరంపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇటీవల మండల సరిహద్దుల్లో జూదం పెరిగిందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా వన్నాంపల్లి గ్రామ సమీపంలో 17మందిని అరెస్టు చేసి... వారివద్ద నుంచి ఒక లక్ష రూపాయల నగదు... 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మండలంలో ఎవరైనా జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు.
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడులు - పరిగిలో పేకాట స్థావరంపై దాడులు
పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 17మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి ఒక లక్ష రూపాయల నగదు...6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై మెరుపుదాడులు