నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి - వెంకటంపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు
రాష్ట్రవ్యాప్తంగా మద్యం రేట్లు అధికమవ్వటంతో కొందరు అక్రమార్కులు నాటుసారా తయారు చేసి అమ్ముతున్నారు. సారానుఇతర ప్రాంతాలకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
![నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి Police raid on liquor settlements at ananthapur dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7180665-429-7180665-1589365356607.jpg)
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి తండాలో నాటుసారాను తయారు చేస్తున్నట్లు పలువురి ఫిర్యాదుతో పోలీసులు తనిఖీ చేపట్టారు. నాటుసారా స్థావరాలపై సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు దాడులు నిర్వహించారు. 30 బిందెల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.