అనంతపురం జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం ఒకటవ పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు పాల్గొని రక్తదానం చేశారు.
హిందూపురంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాలు - police organized blood donate camp
అనంతపురం జిల్లాలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా హిందూపురంలో పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పోలీస్ అమరులకు నివాళులర్పించిన డీఎస్పీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మంచి విషయమని చెప్పారు. ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలకు సీఐ పండ్లు, ప్రశంసాపత్రాలను అందించారు.
ఇదీ చదవండి: నెల్లూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు