ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తరచూ వాహన తనిఖీలకు కారణమదే..! - తరచూ వాహనాలకు తనిఖీ చేస్తున్న అనంతపురం పోలీసులు

మారణాయుధాలు, పేలుడు పదార్థాల తరలింపును అడ్డుకునేందుకు.. జిల్లాలో తరచూ ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అనంతపురం పోలీసులు తెలిపారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణా కట్టడికి.. ఎస్​ఈబీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

vehicle checking by police and seb
వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

By

Published : Dec 10, 2020, 6:06 PM IST

అనంతపురంలోకి మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. తరుచూ ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తూ.. అక్రమాలను అడ్డుకుంటున్నామన్నారు. జిల్లాలోకి ప్రవేశించే, ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామాలకు వెళ్లొచ్చే రహదారులు, పట్టణ శివారు ప్రాంతాల జంక్షన్లలో.. ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతున్నామని పేర్కొన్నారు.

వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

మారణాయుధాలు, పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నారేమో అనే కోణంలో.. గత నెలలో 1,652 వాహనాలను తనిఖీ చేశామని పోలీసులు వివరించారు. ఎస్​ఈబీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా.. ఏకకాలంలో నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు 8 సబ్ డివిజన్ల పోలీసులు, 2 ఎస్​ఈబీ డివిజన్ల అధికారులు బృందాలుగా ఏర్పడి.. కర్ణాటక మద్యం, నాటు సారా రవాణా జరగకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details