అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు కవాతు చేశారు. నియోజకవర్గంలోని మహిళా కానిస్టేబుళ్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అవగాహనకు పోలీసుల కవాతు... - అనంతపురంలో క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. కవాతుతో పాటు ర్యాలీ నిర్వహించారు.
అనంతపురంలో పోలీసుల కవాతు
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎంతో ఆదరణ లభించిందని డీఎస్పీ అన్నారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని..ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: 'రాజధాని మార్పునకు ఒక్క కారణమైనా చెప్పగలరా?'