కోల్కతా నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం వచ్చిన దాదాపు 400 మంది వలస కార్మికులు లాక్డౌన్తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. కార్మికుల ఇబ్బందులను గుర్తించిన ధర్మవరం సీఐ కరుణాకర్ వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పోలీస్స్టేషన్లో ఇతర సిబ్బందితో కలిసి చందాలు వేసుకుని నిత్యావసరాలు కొనుగోలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటిని కార్మికులకు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ కార్మికులు సరుకులు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో కార్మికునికి ఐదు మాస్కులు చొప్పున సీఐ పంపిణీ చేశారు.
ధర్మవరంలో వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - dharmavaram lock down news
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీల వేదన అంతా ఇంతా కాదు. ఉపాధి లేక స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరుతున్నారు. వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం వచ్చిన వలస కార్మికులకు పోలీసులు అండగా నిలిచారు. తమ సొంత ఖర్చులతో వారికి నిత్యావసరాలు అందజేశారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న పోలీసులు