అనంతపురం జిల్లా రెండో పట్టణ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. చేతికి తీవ్ర గాయంతో అల్లాడుతూ ఒంటిపై దుస్తులు లేకుండా తిరుగుతున్న ఓ యువకుడిని అక్కున చేర్చుకున్నారు. నగ్నంగా సంచరిస్తున్న అతనికి... సీఐ జాకీర్ హుస్సేన్, కానిస్టేబుల్ వీర నరసింహరాజు, ఖలీల్.. దుస్తులు వేశారు. ఆహారం తినిపించారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మానవత్వంతో వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న యువకుడిని ఆశ్రమంలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు.
మనసున్న పోలీసులు.. మతి స్థిమితం లేని వ్యక్తిని ఆదరించారు! - మానవత్వంతో వ్యవహరించిన కానిస్టేబుల్
మతిస్థిమితం లేని వాళ్లు కనిపిస్తే తప్పించుకుపోతారు కొందరు. ఆకలితో అలమటించే వారు పక్కనే ఉన్నా జాలి కూడా చూపరు ఇంకొందరు. దిక్కూమొక్కు లేకుండా నగ్నంగా సంచరించే వారిని చూస్తే అసహ్యించుకుంటారు మరికొందరు. కానీ... అనంతపురంలో అలాంటి యువకుడిని చూసి ఓ సీఐ చలించిపోయారు. అతనికి బట్టలు తొడిగించి, ఆహారం తినిపించారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. విధులతో పాటు మానవత్వంతో మతిస్థిమితం లేని వ్యక్తికి సపర్యాలు చేసిన పోలీసులను అందరూ అభినందిస్తున్నారు.
యువకుడిని ఆదరించిన పోలీసులు