ఎన్నికల అనంతరం గ్రామాల్లో ప్రజలు కలసిమెలసి ఉండాలని పోలీసులు ప్రజలకు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రశాంతంగా జీవించాలని.. అల్లర్లు, గొడవల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో రాత్రివేళల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల సమావేశం - సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల సమావేశం వార్తలు
అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల ముగిసిన నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు సమావేశాలు నిర్వహించారు.
సమస్యాత్మక గ్రామాలపై.. పోలీసుల సమావేశం