అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్టుకూరులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ.21,100, ఏడు చరవాణులు, అయిదు ద్విచక్రవాహనాలు, రెండు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ యువరాజు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి... ఏడుగురు అరెస్టు - అనంతపురం జిల్లా నేరాలు
లాక్డౌన్తో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. గ్రామ శివార్లను పేకాట అడ్డాలుగా మారుస్తూ... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా గొట్టుకూరులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి... ఏడుగురు అరెస్టు