అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని జాతీయ రహదారి 42 పై అక్రమంగా తరలిస్తున్న 700 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరు నుంచి చౌక ధరల దుకాణం బియ్యాన్నికర్ణాటక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కదిరికి సమీపంలోని డిగ్రీ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేసి, బియ్యం యజమాని పై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలింపు వెనుక ఎవరెవరున్నారో విచారించి చర్యలు తీసుకుంటామని కోవూరు పోలీసులు తెలిపారు.