శ్రామిక్ రైలులో ముంబయి నుంచి తమిళనాడుకు ప్రయాణిస్తున్న వలస కూలీల ఆకలి తీర్చి గుంతకల్లు పోలీసులు ఆదర్శంగా నిలిచారు. 1,600 మంది వలస కూలీలు ముంబయి నుంచి తమిళనాడులోని విల్లుపురానికి శ్రామిక్ రైలులో శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరారు. రైలు ఆదివారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కూలీలకు ఎక్కడా అన్నపానీయాలు దొరకలేదు.
విషయం తెలుసుకున్న తమిళనాడుకు చెందిన భూమిక ట్రస్టు సభ్యులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించి ఇక్కడి ఎస్పీ సత్య ఏసుబాబును అప్రమత్తం చేశారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్డీటీ సహకారంతో గుంతకల్లు పోలీసులు కూలీలకు ఆహారం, మంచినీళ్ల సీసాలను అందించారు. దీంతో కూలీలంతా సంతోషం వ్యక్తం చేశారు.