ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు

Police Save lifes: ఆత్మహత్యకు యత్నించిన ఓ కుటుంబాన్ని పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ తండ్రి.. ఇద్దరు పిల్లలు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని కాపాడారు. అనంతరం వారికి మనోధైర్యం కల్పించి... బంధువులకు అప్పగించారు.

Police have rescued a family
Police have rescued a family

By

Published : Jun 23, 2022, 5:34 PM IST

అనంతపురంలో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన తండ్రిని, ఇద్దరు పిల్లలను స్థానిక పోలీసులు కాపాడారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు తన భార్యాపిల్లలతో కలిసి.. స్థానిక ఆదర్శ నగర్​లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో 13 సంవత్సరాల కుమార్తె, 11 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకుని.. నాయక్ నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో 4వ పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ తక్షణమే స్పందించి.. తన బ్లూకోల్ట్ సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపి వారిని రక్షించారు. అనంతరం వారికి మనోధైర్యం కల్పించి బంధువులకు అప్పగించారు. తండ్రి, ఇద్దరు పిల్లలను కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప అభినందించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details