అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచారని...అనంతపురం జిల్లాలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లిలో గంజాయి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో నివాసం ఉంటున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కొక్కంటి క్రాస్‌లో ముళ్లపొదల్లో నిల్వ ఉంచిన 40కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపారు.
అక్రమ గంజాయి పట్టివేత...నలుగురు అరెస్ట్ - అనంతపురం జిల్లాలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్ట్..
అనంతపురం జిల్లాలో అక్రమంగా గంజాయిని నిల్వ చేసి అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![అక్రమ గంజాయి పట్టివేత...నలుగురు అరెస్ట్ Police have arrested four persons for illegally storing and selling Cannabis in Anantapur district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5256312-309-5256312-1575374304906.jpg)
అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇవీ చదవండి...గుంటూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు