అనంతపురం జిల్లా కదిరిలో నిషేధిత మద్యం, గుట్కాను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తన్న అనే వ్యక్తి వీటిని అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో తనిఖీ చేశారు.
కర్ణాటక మద్యం, గుట్కాపాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. అతని నుంచి 20 బాటిళ్ల కర్ణాటక మద్యం, రూ. 1200 విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.