అనంతపురంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ముత్యాలమ్మ కాలనీకి చెందిన రామాంజనేయులు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారానే సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో గుట్టుగా మద్యం విక్రయిస్తున్నట్లు గమనించి పట్టుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి 280 విస్కీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
అక్రమ మద్యం పట్టివేత... ఓ వ్యక్తి అరెస్టు - latest news in anantapur
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 280 విస్కీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అక్రమ మద్యం పట్టివేత