అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామ రైతు విశ్వనాథరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వేరుశనగ, ద్రాక్ష పంటలు విక్రయించిన నగదుతో పాటు రైతును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో తెదేపా నాయకులకు మద్దతిస్తున్నావంటూ పోలీసులు బెదిరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
'తెదేపాకు మద్దతిస్తున్నాడని.. పోలీసులు వేధిస్తున్నారు' - అనంతరంలో బొమ్మేపర్తిలో రైతుకు వేధింపులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి పరిషత్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి మద్దతిచ్చినందుకు విశ్వనాథరెడ్డి అనే రైతును పోలీసులు వేధిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పంట విక్రయించిన డబ్బు, రైతును స్టేషన్కు తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
police harassment to farmer for supporting tdp in parishath elections
వ్యాపారి ఇచ్చిన బిల్లులు, పంట అమ్మిన ఆధారాలు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు చూపినా పోలీసులు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బొమ్మేపర్తి రైతులు.. రాప్తాడు పోలీసులపై ఎస్పీ సత్యఏసు బాబుకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఇడుపులపాయలో విద్యార్థుల మధ్య ఘర్షణ..