ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం - person suicide attempt at ananthapur dist

బెల్లం రవాణా చేస్తున్నానని తన ఐచర్ వాహనాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయడంతో ఓ వ్యక్తి విద్యుత్​ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

police harassment  person's suicide attempt at ananthapur dist
పోలీసుల వేధింపులు తట్టుకోలేకే...వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 25, 2020, 11:02 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జి.కొట్టాలలో పులగుట్టపల్లి చిన్నతండాకు చెందిన సీనా నాయక్ విద్యుత్​ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. భూమి తనఖా పెట్టి కొనుగోలు చేసిన ఐచర్ వాహనాన్ని... బెల్లం రవాణా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారన్నారు. ఈ క్రమంలో బతుకు భారం కావటంతో పాటు ఎక్సైజ్ పోలీసులు తమని వేధిస్తున్నారని సీనా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కిందకు దిగాలని కోరారు. అతడు ససేమిరా అనటంతో విద్యుత్ సిబ్బంది పీడర్ సరఫరా నిలిపివేసి...టవర్ ఎక్కి కిందకు తీసుకువచ్చారు. సంబంధం లేకున్నా పోలీసులు తనను వేధిస్తున్నారని మీడియాకు తెలిపాడు. బతుకు భారమై ఆత్మహత్యే శరణ్యమని ఇక్కడకు వచ్చానని కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి:

పాత క్లస్టర్లలోనే ఎక్కువ కరోనా కేసులు: జవహర్​ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details