అనంతపురం జిల్లాలో రంజాన్ పండగను పురస్కరించుకుని చేసుకునే ప్రార్థనల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు సమావేశం నిర్వహించారు. కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ మత పెద్దలతో భేటీ అయ్యారు. రంజాన్ మాసంలో నిపుణుల సూచనలతో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల్లో ఐదుగురు మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. వీరు విధిగా సామాజిక దూరం పాటించాలన్నారు. నమాజు చదివే సమయంలో సామాజిక దూరంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రంజాన్ వేళ.. ముస్లిం పెద్దలతో పోలీసుల భేటీ - During the Ramadan, Police held meeting with Muslim elders
అనంతపురం జిల్లాలో రంజాన్ మాసం ప్రార్ధనల విషయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై పోలీసులు.. ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మసీదుల్లో ఐదుగురే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
రంజాన్ వేళ.. ముస్లీం పెద్దలతో పోలీసుల భేటీ