తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంతో పోలీసులు ఏకంగా పోలీసు స్టేషన్లోనే విందు చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని హిందూపురం రెండో పట్టణ పోలీసులు 15 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం పోలీసు స్టేషన్లోనే ఉంచగా.. దాని నుంచి కొన్ని మద్యం సీసాలు తీసుకొని ఓ గదిలో విందు చేసుకున్నారు. పోలీసులు మద్యం సేవిస్తోన్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఘటనపై స్పందించిన అధికారులు...