Police Drinking at PS Video: అక్కడ మద్యం తాగితే ఎవరూ పట్టించుకోరులే అనుకున్నారేమో ఆ ఖాకీలు.. గుట్టు చప్పుడు కాకుండా మద్యం తాగారు. కానీ వారు మద్యం తాగుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పీఎస్లో నాలుగు రోజుల క్రితం జరిగింది. ఉరవకొండ పీఎస్ పోలీసులు నాలుగు రోజుల క్రితం బహిరంగంగా మద్యం తాగుతున్న యువకులని పట్టుకొని వారి వద్ద నుంచి డబ్బు లాక్కొని..బెదిరించి.. వారి తోనే మద్యం తెప్పించుకున్నారని తెలుస్తోంది. స్టేషన్కు మద్యం తెప్పించుకున్న వారు పోలీస్ స్టేషన్ పైన గదిలో మద్యం తాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు మద్యం తాగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. ఆ కానిస్టేబుళ్లు తరచూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై స్థానిక పోలీసు అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.
Police Drinking at PS: అక్కడ తాగితే ఎవరూ పట్టించుకోరనుకున్నారు.. కానీ వీడియో వైరలయ్యింది.. - పోలీసు స్టేషన్ లోనే మద్యం తాగుతున్న పోలీసులు
Police Drinking at PS Video: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులే మద్యం తాగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా మద్యం తాగుతున్న వారిని బెదిరించి మరీ వారితో మద్యం తెప్పించుకుని తాగడం వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పీఎస్లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది.
Police Drinking at PS