ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం - Anantapur district latest news

అనంతపురం జిల్లాలో ఇటీవల మృతి చెందిన బెళుగుప్ప పోలీస్ స్టేషన్​ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సహచర ఉద్యోగులు ఆర్థిక సాయం అందించారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చేతుల మీదుగా రూ. 2,04,116 నగదు మృతుడి కుటుంబానికి అందజేశారు.

Police donate founds to constable family
మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

By

Published : Dec 1, 2020, 7:51 PM IST

అనంతపురం జిల్లాలో పోలీసులు దాతృత్వం చాటారు. మృతి చెందిన సహచర కానిస్టేబుల్​ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. బెళుగుప్ప పోలీసు స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న సూర్యనారాయణ... ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతుడి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని ఆయన సహచర ఉద్యోగులు సంకల్పించారు. ఈ క్రమంలో రూ. 2,04,116 మొత్తాన్ని సేకరించారు. ఈ నగదును జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చేతుల మీదుగా సూర్యనారాయణ కుటుంబీకులకు అందజేశారు. ఈ సాయం పట్ల సూర్యనారాయణ భార్య విమలాదేవి, కూతురు లక్ష్మీసాయి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details