సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా అనంతపురం జిల్లా గుత్తిలో ఎంతో మంది యాచకులు, నిరాశ్రయులు ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు. వందమందికి ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లను అందజేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఎస్ఐ గోపాలుడుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిరాశ్రయులు, యాచకులకు.. పోలీసుల అన్నదానం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
కరోనా కారణంగా ఎంతో మంది యాచకులు, నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆహరం అందిస్తూ ఆదుకుంటున్నారు అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు.
![నిరాశ్రయులు, యాచకులకు.. పోలీసుల అన్నదానం gutti police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12043514-1070-12043514-1623046164260.jpg)
గుత్తి పోలీసులు