అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవేడు గ్రామంలో నిన్న హత్య జరిగిన రాజగోపాల్, నారాయణప్ప మృతదేహాలకు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆరవేడు గ్రామానికి మృతదేహాలు చేరుకోవడంతో మృతుల బంధువులు చివరి చూపు తరలివచ్చారు. కానీ ఆరవేడు గ్రామ సమీపంలోకి ఎవరు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బందువులు చివరి చూపు కోసం ఒక్కసారైనా చూస్తామన్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడికి వచ్చిన మృతుల బందువులు కన్నీరుమున్నీరయ్యారు.
కడసారి చూపు కోసం కనికరించని పోలీసులు - ananthapuram latest news
ఆనంతపురం జిల్లాలో నిన్న హత్యకు గురైన రాజగోపాల్, నారాయణప్ప మృతదేహలకు పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహలను ఆరవేడు గ్రామాలకు తరలించగా మృతదేహలను చూడటానికి మృతుల బంధువులకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
మాట్లాడుతున్న మృతుని బంధువు