Police destroyed illegal liquor : సెబ్ ఆధ్వర్యంలో పట్టుబడిన రూ 6.10 లక్షలు విలువైన కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. మెుత్తం 72 కేసులలో పట్టుబడిన రూ.6.10 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని శనివారం స్థానిక బైపాస్ రోడ్డులో అధికారులు ధ్వంసం చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలించిన 16,636 టెట్రా ప్యాకెట్లతోపాటుగా, 73 కేసుల మద్యాన్ని అనంతపురం సెబ్ అడిషనల్ ఎస్పీ బి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో రోడ్డుపై వేసి టిప్పర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం, గుట్కా వంటి నిషేధిత వస్తువులను రవాణా చేసినా, విక్రయించిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని తెలిపారు. అలాంటివారిపై కఠిన చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం సెబ్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
Illegal liquor అనంతపురంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు - మద్యం ధ్వంసం
Illegal liquor రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి, కొందరు ఏదో ఒక రూపంలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు . పోలీసులు నిరంతరం నిఘా పెడుతూ, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, అక్రమ మద్యాన్ని నిలువరించే ప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే పట్టుకున్న మద్యాన్ని అధికారులు ధ్వంసంచేశారు.
అనంతపురంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు