అనంతపురం పిల్లిగుండ్ల కాలనీలో ఉండే ఏడు సంవత్సరాల నితిన్ కుమార్ రెడ్డి అనే బాలుడు తప్పిపోయాడు. బాలుడి తండ్రి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్ రెడ్డి సిబ్బందితో గాలింపు చేపట్టారు. చరవాణిలో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపులకు సమాచారాన్ని అందించారు. చివరకు బాలుడి ఆచూకీ కనుగొన్నట్లు డీఎస్పీ వీర రాఘవరెడ్డి చెప్పారు. సాయంత్రం వేళలో ఆడుకుంటూ తప్పిపోయిన చోట.. పోలీసులు విస్తృతంగా గాలించారు.
బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న కారు కింద పడుకున్నట్లు గుర్తించారు. అతడే పడుకున్నాడా లేక ఎవరైనా మత్తు మందు ఇచ్చి పడుకో పెట్టారా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని... మిస్సింగ్ లాంటి ఏవైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు.