అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో ఈనెల 19న జరిగిన హిజ్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హిజ్రా తన చిన్ననాటి స్నేహితుడైన రాజశేఖర్‌కు రూ.మూడు లక్షలు అప్పు ఇచ్చింది. అప్పును తిరిగి చెల్లించమన్నందుకే రాజశేఖర్ తన స్నేహితుడితో కలిసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. రాజశేఖర్‌తో పాటు అతని స్నేహితుడు హనుమంతును అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపామని పోలీసులు తెలిపారు.
హిజ్రా హత్య కేసును ఛేదించిన పోలీసులు - hijra murder case updates
అనంతపురంలో జరిగిన హిజ్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన చిన్ననాటి స్నేహితుడే హిజ్రాను హత్య చేశాడని తెలిపారు. అప్పును తిరిగి చెల్లించమన్నందుకే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు స్పష్టం చేశారు.

హిజ్రా హత్య కేసును ఛేదించిన పోలీసులు