అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు, ప్రత్యేక సోదాలు నిర్వహించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, నాటు సారా తయారీ, విక్రయాలపై నిఘా వేసి, దాడులు చేపట్టారు.
అనంతలో అక్రమార్కులపై నిఘా.. అణువణువూ గాలింపు - Police cordon, search at anantapuram news
కర్ణాటక మద్యం సరఫరా, నాటు సారా తయారీ.. వాటి విక్రయాలపై అనంతపురం జిల్లాలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అక్రమార్కుల ఆట కట్టించేలా అణువణువూ తనిఖీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
అనంతలో అనువణువు గాలింపు
జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. తండాలు, అటవీ ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లు, గడ్డి వాములు, పశవుల పాకలు, పొలాలు, కర్ణాటక సరిహద్దు రహదారులు, గ్రామాలు, తదితర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: