ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - అనంతపురంలో మద్యం అక్రమ రవాణాపై నిఘా

అక్రమంగా నిల్వ చేసిన మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మద్యం అక్రమ రవాణా, నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలపై పూర్తి నిఘావేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Police cordon search in Anantapur
జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్

By

Published : Dec 20, 2020, 4:43 PM IST

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ఉదయం నుంచి మద్యం అక్రమ రవాణా, నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలపై నిఘా వేసి తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బృందాలుగా విడిపోయిన అధికారులు తండాలు, అటవీ ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లు, పొలాలు, పశవుల పాకలు, దుకాణాలు, కర్నాటక సరిహద్దు రహదారులు, గ్రామాలు, తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లోని మద్యం విక్రయదారులకు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details