అనంతపురం జిల్లా ఎన్పీకుంట పోలీసులు ఏన్జీపీ తండా పరిసరాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీలో వినియోగించే తుమ్మ చెక్క ఒక బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం అమ్మకం, సారా తయారీ వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని నంబుల పూలకుంట, అమడగూరు, ముదిగుబ్బ ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించి.. సారా ఊటను ధ్వంసం చేశారు. నంబుల పూలకుంట మండలం నల్లగుంట్ల పల్లితండాపరిసరాలలో దాడులు చేసి .. 200 లీటర్ల ఊటను, తుమ్మ చెక్కను స్వాధీనం చేసుకున్నారు.
ఆమడగూరు పోలీసులు మహమ్మదాబాద్లో తనిఖీచేసి 120 కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.