ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు - కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు

అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్ దేవేంద్ర కట్నం కోసం వేధిస్తున్నాడని అతని భార్య ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విచారం వ్యక్తం చేస్తోంది

police constable harassing for dowry at ananthapur
అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు

By

Published : Jul 17, 2020, 7:45 PM IST

పోలీస్ కానిస్టేబులైన తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని అనంతపురంలో దేవేంద్ర భార్య ఆరోపించింది. ఎనిమిది నెలల కిందట పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందని.. పెళ్లైన నెల రోజుల నుంచే భర్త, అత్తమామల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అప్పటికే అత్తమమాలకు అప్పులు ఉండటంతో.. అదనపు కట్నం తేవాలని నిత్యం వేధింపులకు గురి చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫిర్యాదు చేయగా.. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఎస్తై భర్త వైపు మాట్లాడటంతో మనోవేదనకు గురైనట్లు తెలిపింది. పోలీసులే న్యాయం చేయకపోతే తనకు ఎక్కడ న్యాయం జరుగుతుందని బాధితురాలు ప్రశ్నించింది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తన భర్తకు బుద్ధి చెప్పి తనతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి: అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details