ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాల నిందితుడు గ్లెన్​బ్రిగ్స్​ ఇంట్లో పోలీసుల తనిఖీలు - అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసుల దాడులు

అనంతపురం జిల్లాలో నకిలీ ధ్రువపత్రాల నిందితుడు గ్లెన్​బ్రిగ్స్ ఇంట్లో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. నకిలీ ధ్రువపత్రాలు, మద్యం సీసాలను సీజ్ చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు.

Police checks on Glen Bricks home
గ్లేన్​బ్రిక్స్ ఇంటిపై పోలీసుల తనిఖీలు

By

Published : Feb 10, 2020, 7:16 PM IST

గ్లెన్​బ్రిగ్స్​ ఇంట్లో పోలీసుల తనిఖీలు

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడు, విక్రేత గ్లెన్​బ్రిగ్స్ ఇంటిపై మరోసారి అధికారులు దాడులు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అతని నివాసంలో ఉదయం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు.

నకిలీ ధ్రువపత్రాలు లభ్యం

ఈ సోదాల్లో నకిలీ ధ్రువపత్రాలు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అధికారులు వీటిని సీజ్ చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ ధ్రువపత్రాలు ఎవరికోసం తయారు చేశారు, ఏ విద్యా శాఖకు సంబంధించినవి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ పత్రాలతో లబ్ది పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు సేకరించి వారిని విధుల నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వీడు కేటుగాడు. మహామాయగాడు..

ABOUT THE AUTHOR

...view details