ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంధువుల మధ్య భూ వివాదం.. హత్యకు కుట్ర.. పోలీసుల ఎంట్రీతో..! - latest news in ap

POLICE BUSTED THE MURDER CONSPIRENCY IN ANANTAPUR : ఆ ముగ్గురు బంధువులవుతారు. భూ వివాదం నేపథ్యంలో గొడవలు మొదలయ్యాయి. ఆ వివాదం కాస్తా కోర్టు వరకూ చేరింది. ఈ భూమి ఎక్కడ తమకు దక్కకుండా పోతుందన్న కోపంలో హత్య చేయడానికి పాల్పడ్డారు. కానీ అక్కడో చిన్న ట్విస్ట్​ ఉంది..

POLICE BUSTED THE MURDER CONSPIRENCY IN ANANTAPUR
POLICE BUSTED THE MURDER CONSPIRENCY IN ANANTAPUR

By

Published : Mar 17, 2023, 12:29 PM IST

POLICE BUSTED THE MURDER CONSPIRENCY IN ANANTAPUR : ఓ హత్య కుట్రను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు భగ్నం చేశారు. హత్యకు పాల్పడాలని చూసిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 1 కారు, 6 సెల్​ఫోన్లు, 2 బైకులు, ఒక కత్తి, ఇనుప రాడ్​ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: పట్టణంలో నివసిస్తున్న ఎం. శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామిరెడ్డి, జి. శ్రీనివాస్ రెడ్డి.. ముగ్గురు బంధువులు. వీరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఇటీవల జిల్లా కోర్టుని ఆశ్రయించగా.. విచారణ జరిపిన కోర్టు వెంకట్రామిరెడ్డి, జి.శ్రీనివాసుల రెడ్డికే భూమి చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయితే జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ ఎం. శ్రీనివాసులు రెడ్డి హైకోర్టులో పిటిషన్​ వేశాడు. దీనిని జీర్ణించుకోలేని.. వెంకట్రామిరెడ్డి, జి. శ్రీనివాస్​రెడ్డిలు హత్యకు కుట్రపన్నారు. వీరికి మిత్రులైన మల్లికార్జున రెడ్డి, నంద ప్రసాద్ రెడ్డి, సునీల్, అరుణ్​కుమార్​లతో మాట్లాడుకుని హత్యకు పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన అనంతపురం పట్టణంలోని మారుతి నగర్ మూడో క్రాస్​లో ఎం.శ్రీనివాసులు రెడ్డిపై దాడి చేసి హత్య చేయాలని చూశారు" అని సీఐ జాకీర్​ హుస్సేన్​ తెలిపారు.

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు:ఈ నెల 11వ తేదీన గొడవ జరుగుతుందని మాకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే మేము ఘటనాస్థలికి వెళ్లగా.. ఎం. శ్రీనివాసులు రెడ్డిపై వెంకట్రామి రెడ్డి, జి. శ్రీనివాస్​రెడ్డి కత్తితో దాడి చేసి వీపు పైన ఇనుప కడ్డీతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎం. శ్రీనివాసులు రెడ్డిని.. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి.. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకి తరలించాం అని సీఐ తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. నిన్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు బైకులు, 6 సెల్​ఫోన్లు, ఒక కత్తి, ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి.. వారిని రిమాండ్​కు తరలిస్తామని పట్టణ సీఐ జాకీర్​ హుస్సేన్​ తెలిపారు. ఎటువంటి గొడవలు, అల్లర్లు జరిగిన ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని సూచించారు. నిందితులను పట్టుకున్న బృందాలను ఆయన అభినందించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చిన స్థానికులను ఆయన అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details