Paritala Ravindra Memorial Trust: అనంతపురం నగర సమీపంలోని రాప్తాడు నియోజకవర్గం సోమలదొడ్డి వద్ద అశ్వర్థ నారాయణ స్వామి తిరునాళ్లలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తిరునాళ్లలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా.. కనీసం మంచినీరు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. భక్తుల కోసం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం నాయకులు ప్రతి ఏటా మజ్జిగ, తాగునీరు సరఫరా చేస్తుంటారు. ఆదివారం కూడా భక్తులు వేలాది మంది రావడంతో మజ్జిగ, తాగునీరు పంపిణీ ప్రారంభించారు.
అనంతపురంలో టీడీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యం.. - said it would tyranny if it was distributed free
Paritala Ravindra Memorial Trust: అనంతపురం నగర సమీపంలోని రాప్తాడు నియోజకవర్గం సోమలదొడ్డి వద్ద అశ్వర్థ నారాయణ స్వామి తిరునాళ్లలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. స్వామిభక్తిని చాటేందుకు అత్యుత్సాహం చూపారు. మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని మరో చోటకు మార్చాలని సీఐ హుకుం జారీ చేశారు. సీఐ ఆగ్రహంతో టీడీపీ నేత చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు. ఇదంతా చూస్తున్న భక్తులు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. స్వామిభక్తిని చాటేందుకు అత్యుత్సాహం చూపారు. మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని మరో చోటకు మార్చాలని, అక్కడున్న పరిటాల రవీంద్ర, సునీతల ఫ్లెక్సీలను తొలగించాలని సీఐ విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐ నబీ రసూల్ హుకుం జారీ చేశారు. సీఐ ఆగ్రహంతో.. టీడీపీ నేత చల్లా నాయుడి చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు. ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నామని, ఎమ్మెల్యే వస్తున్నారంటూ తొలగించడమేంటని టీడీపీ నాయకులు ప్రతిఘటించారు. ఇదంతా చూస్తున్న భక్తులు.. పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేవాలయం వద్ద రాజకీయాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: