అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దగ్ధం చేయడానికి నిరసనగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రథాన్ని తగలబెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు.
ఈ నేపథ్యంలో మడకశిర సర్కిల్ పోలీసులు ప్రసిద్ధిగాంచిన చందకచర్ల గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులను, ప్రధాన అర్చకులను, గ్రామస్థులను సమావేశపరిచారు. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు దేవస్థానం రక్షణకై బాధ్యత నిర్వర్తించాలని అన్నారు. దేవస్థానానికి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఐ రాజేంద్రప్రసాద్ సూచించారు.