ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం, ఇసుక అక్రమ రవాణాపై విస్తృత దాడులు

అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సారథ్యంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై నవంబరులో విస్తృతంగా దాడులు జరిగాయి. కర్నాటక రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేయకుండా.. నాటు సారా తయారీ, విక్రయాలపై పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో బృందాలు, పోలీసు బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.

police attacks
మద్యం, ఇసుక అక్రమ రవాణాపై విస్తృత దాడులు

By

Published : Dec 5, 2020, 5:17 PM IST

అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు నవంబరు నెలలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారి రామమోహనరావు పర్యవేక్షణలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీదారులు, విక్రేతలు, మద్యం అక్రమ రవాణాదారులపై నిఘా కొనసాగిస్తున్నారు. జిల్లాలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 59,420 మద్యం టెట్రా ప్యాకెట్లు, 1,242 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 822 మందిపై కేసులు నమోదు చేశారు. 27,895 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 2,185 లీటర్ల నాటుసారా, సారా తయారీకీ వినియోగించే 140 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక అక్రమ రవాణాపైనా నిరంతరం నిఘా పెట్టి.. 56 కేసులు నమోదు చేసి 77 మందిని అరెస్టు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 56 వాహనాలు పట్టుకుని 193 టన్నుల ఇసుక సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు పెట్టి.. 20 వాహనాలు, 29.5 టన్నుల ఇసుక సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details