అనంతపురం జిల్లా గుత్తి ,యాడికి మండలం పరిధిలోని పలు తండా గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుత్తిలో 7500, యాడికి లో 500 లీటర్ల చోప్పున మొత్తం 8 వేల లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేసి 55 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేశామన్నారు. గ్రామాల్లో నాటుసారా అక్రమంగా నిలువ ఉంచిన, తయారుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ దాడుల్లో సిఐలు రాజశేఖర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ఐ లు గోపాల్, మల్లికార్జున్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.