అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య వివాదం చెలరేగింది. నిమజ్జనం జరిగిన రెండు రోజుల తరువాత తమను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని యువకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన ముగ్గురు యువకులను గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తిక్కస్వామి, గణేష్‌లు గ్రామంలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తుండగా.. మరో యువకుడు రామాంజనేయులుగా గుర్తించారు.
వాలంటీర్లను చితకబాదిన పోలీసులు...ఎందుకంటే..!
అనంతపురం గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులకు, యువకులకు మధ్య వివాదం జరిగింది. ఈ వివాదం జరిగిన రెండు రోజుల తరువాత తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి... కొట్టారని బాధిత యువకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన యువకులను గ్రామస్థులు.. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.
వాలంటీర్లపై పోలీసులు దాడి
సీఐ, ఎస్ఐ పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్లి.. వారు లేని సమయంలో స్టేషన్లో పోలీసులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తమను కులం పేరుతో దూషించి.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పట్టణ సర్కిల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి