అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేసిన దాడుల్లో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 10వేల 500రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్లు, అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీదారులు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై హెచ్చరించారు.
పేకాట స్థావరంపై దాడి...14 మంది అరెస్టు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.14మందిని అరెస్ట్ చేసి 10వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
police attack on gambling centers in anantapur dst arrestd the persons who ate playing