ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరూ కర్ణాటకలో పట్టుబడ్డారు.. మళ్లీ ఏపీలో - ఏపీలో డ్రగ్ అమ్మకాలపై వార్తలు

Two Drug Dealers in Anantapur: డ్రగ్స్ విక్రయిస్తున్న కర్ణాటకకు చెంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనంతపురం జిల్లా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణలో ప్రధాన సూత్రధారి నైజీరియా దేశానికి చెందిన అంటోనీ శ్యాముల్​గా గుర్తించినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
Two Drug Dealers in Anantapur

By

Published : Dec 20, 2022, 10:21 PM IST

Police Arrested Two Drug Dealers: అనంతపురం నగర శివారు ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న కర్ణాటకకు చెంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల నిషేధిత డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన సయ్యద్ క్యూబ్ జావిద్, షేక్ పర్వేజ్ ఇద్దరు డ్రగ్స్ వాడటానికి అలవాటు పడ్డారు. వీరిద్దరూ డబ్బులు కోసం బెంగళూరులోని వివిధ ప్రాంతంలో డ్రగ్స్​ను విక్రయించేవారని తెలిపారు. అక్కడ పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించారు. విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్​లో విక్రయాలు చేయాలని అనంతపురానికి వచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు.

నగర శివారులో అనుమానాస్పదంగా ఉన్న వీరిని మూడో పట్టణ పోలీసులు పట్టుకొని విచారించగా.. అసలు విషయం తెలిసిందని ఆయన తెలిపారు. ఇందులో ప్రధాన సూత్రధారి నైజీరియా దేశానికి చెందిన అంటోనీ శ్యాముల్​గా గుర్తించామన్నారు. ప్రస్తుతం ఇతను అరెస్టై బెంగళూరు జైల్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నట్టు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

డీఎస్పీ ప్రసాద్ రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details