అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్లఅనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సోదరులు గాయపడ్డారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లికి చెందిన అన్నదమ్ములు గొర్రెలు కొనేందుకు కదిరికి వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పింది. స్థానికులు 108కు సమాచారం అందించటంతో, వారు వచ్చి బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రుల నగదు జాగ్రత్తగా అప్పగించిన 108 సిబ్బందికి అభినందనలు - road accident at ralla ananthapuram
క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించడమే కాదు... వారి వస్తువులను జాగ్రత్తగా అప్పగించి మన్ననలు పొందారు 108 సిబ్బంది. పోలీసులు సైతం వారిని ఆభినందించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు
క్షతగాత్రుల దగ్గర ఉన్న రూ.49,300 నగదు, రెండు చరవాణులను 108 వాహన సిబ్బంది భద్రపరచి, బాధితుల కుటుంబసభ్యులకు అందజేశారు. అంబులెన్స్ సిబ్బంది మంచితనం చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రశంసించారు.